Meenakshi Natarajan padayatra
Summary:
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై కాంగ్రెస్ హైకమాండ్‌కి విశ్వాసం తక్కువవుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణగా Meenakshi Natarajan padayatra వ్యవహారాన్ని చెప్పుకోవచ్చు. ఈనెల 31వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆమె పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. ఇది కేవలం ప్రజల మద్దతు కోసం చేసే కార్యక్రమం కాదు. ఇది హైకమాండ్ చేపట్టిన అంతర్గత విశ్లేషణ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీ పర్యటనలో రేవంత్ పాలనపై తానే నియమించిన కొందరు మంత్రులే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. “సోనియా గాంధీ పేరు చెప్పి నా పాలన అద్భుతం” అని రేవంత్ చెప్పిన మాటలపై రాహుల్ గాంధీ అసంతృప్తిగా ఉన్నారు. అందుకే స్వయంగా మీనాక్షిని రంగంలోకి దించి ప్రతి నియోజకవర్గంలో ప్రజా అభిప్రాయాలను సేకరించాలంటూ రిపోర్ట్ తయారుచేయమని ఆదేశించారని సమాచారం.
ఇటీవల రేవంత్ పాలనపై ఆయన మంత్రులే ఢిల్లీలో ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. దీని అనంతరం హైకమాండ్ వ్యూహాత్మకంగా Meenakshi Natarajan padayatra కు ప్రణాళిక రూపొందించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోనియా గాంధీ పేరు చెప్పి తన పాలనను గొప్పగా ప్రచారం చేస్తున్న రేవంత్ మాటలను రాహుల్ నమ్మకపోవడం, ఇప్పుడు రాష్ట్ర నాయకత్వ మార్పుకు సంకేతంగా భావించబడుతోంది.
అందువలన రాహుల్ గాంధీకి అత్యంత విశ్వసనీయంగా పేరు పొందిన నేతగా గుర్తింపు పొందిన మీనాక్షి నటరాజన్‌కు పార్టీ ఆంతర్యాన్ని, కేడర్ స్థాయి అభిప్రాయాలను అర్థం చేసుకునే శక్తి ఉన్న నేతగా ఆమెపై హైకమాండ్‌కు నమ్మకం ఉండటంతో తెలంగాణ కాంగ్రెస్ విషయంలో పాదయాత్ర రూపంలో ఆమెకు అత్యంత కీలకమైన బాధ్యత ఇవ్వడంతో రాహుల్ గాంధీ మౌనంగా అయినా రేవంత్ రెడ్డికి స్పష్టమైన సంకేతం ఇచ్చినట్టుగా సమాచారం.
Meenakshi Natarajan padayatra షెడ్యూల్ (జూలై 31 – ఆగస్టు 6, 2025)
| తేదీ | జిల్లా | నియోజకవర్గం | సమయం | కార్యక్రమం |
|---|---|---|---|---|
| జూలై 31 | రంగారెడ్డి | పరిగి AC | సా. 5:00 | పాదయాత్ర |
| ఆగస్టు 1 | రంగారెడ్డి | పరిగి AC | ఉ. 11:00, మ. 3:00 | శ్రమదానం, వర్కర్స్ మీటింగ్ |
| ఆగస్టు 1 | మెదక్ | అంధోల్ (SC) AC | సా. 5:00 | పాదయాత్ర |
| ఆగస్టు 2 | మెదక్ | అంధోల్ AC | ఉ. 11:00, మ. 3:00 | శ్రమదానం, వర్కర్స్ మీటింగ్ |
| ఆగస్టు 2 | నిజామాబాద్ | ఆర్మూర్ AC | సా. 5:00 | పాదయాత్ర |
| ఆగస్టు 3 | నిజామాబాద్ | ఆర్మూర్ AC | ఉ. 11:00, మ. 3:00 | శ్రమదానం, వర్కర్స్ మీటింగ్ |
| ఆగస్టు 3 | ఆదిలాబాద్ | ఖానాపూర్ (ST) AC | సా. 5:00 | పాదయాత్ర |
| ఆగస్టు 4 | ఆదిలాబాద్ | ఖానాపూర్ AC | ఉ. 11:00, మ. 3:00 | శ్రమదానం, వర్కర్స్ మీటింగ్ |
| ఆగస్టు 4 | కరీంనగర్ | చొప్పదండి (SC) AC | సా. 5:00 | పాదయాత్ర |
| ఆగస్టు 5 | కరీంనగర్ | చొప్పదండి AC | ఉ. 11:00, మ. 3:00 | శ్రమదానం, వర్కర్స్ మీటింగ్ |
| ఆగస్టు 5 | వరంగల్ | వర్ధన్నపేట (SC) AC | సా. 5:00 | పాదయాత్ర |
| ఆగస్టు 6 | వరంగల్ | వర్ధన్నపేట AC | ఉ. 11:00, మ. 3:00 | శ్రమదానం, వర్కర్స్ మీటింగ్ |
Meenakshi Natarajan padayatra కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు రాజ్ ఠాకూర్, శంకర్ నాయిక్, కేతోరి వెంకటేష్, జులూరు ధనలక్ష్మి, పులి అనిల్ కుమార్‌లకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు.
ప్రతి నియోజకవర్గంలో 8 నుంచి 10 కిలోమీటర్ల పాదయాత్ర, వారం రోజుల పాటు నిర్వహించనున్న ఈ పాదయాత్ర పూర్తయిన తర్వాత మీనాక్షి హైకమాండ్‌కు నివేదిక సమర్పించనున్నారు. అదే నివేదిక ఆధారంగా రేవంత్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే పార్టీలో ఉన్న బలహీనతలు, అధికారంలో ఉన్నా పార్టీ అంతర్గతంగా విభేదాలు – ఇవన్నీ కలిపి చూస్తే నాయకత్వ మార్పుకు మూడ్ సిద్ధమవుతోందా? అన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్‌లో భిన్న గోళాలు వినిపిస్తున్న వేళ, మీనాక్షి పాదయాత్ర నిజంగానే ఒక సర్వేనా? లేక రేవంత్ కి చివరి ఛాన్స్నా అన్నది ఇప్పుడు హాట్ డిబేట్.
Meenakshi Natarajan padayatra పాదయాత్ర ప్రజల్లో కాంగ్రెస్ హైకమాండ్ కోసం స్పందన సేకరించడమే కాదు, రేవంత్ నాయకత్వాన్ని మూల్యాంకనం చేయడానికే ప్రధానంగా జరుగుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలపడుతోంది. ఈ నివేదిక ఆధారంగా పార్టీ తాత్కాలిక నిర్ణయం కాక, ఘనమైన మార్పును తీసుకురావాలని ఢిల్లీ లోభాగంలో ఓ చర్చ నడుస్తోందని సమాచారం.
మరిన్ని తాజా రాజకీయ విశ్లేషణల కోసం ఫాలో అవండి Today Scoop News – Telugu.
