Kalpika Ganesh
Kalpika Ganesh : హైదరాబాద్ గచ్చిబౌలిలో శుక్రవారం రాత్రి ప్రముఖ టాలీవుడ్ నటి కల్పిక గణేష్‌పై పబ్‌లో దాడి జరిగిన ఘటన సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. బర్త్‌డే కేక్ విషయంలో జరిగిన చిన్న మాటల తార్పేడే పెద్ద గొడవకు దారి తీసింది. ప్రిజం పబ్‌లో స్టాఫ్ సభ్యులతో జరిగిన వాగ్వాదం అనంతరం, వారు తనపై దురుసుగా ప్రవర్తించి, బూతులు తిట్టి, దాడికి దిగారని కల్పిక గణేష్ ఆరోపించారు.
Summary:
ఈ ఘటనకు సంబంధించిన Kalpika Ganesh వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం, పబ్‌లో కాంప్లిమెంటరీ కేక్ విషయంలో తలెత్తిన వివాదం వేడెక్కి, ఘర్షణ స్థాయికి చేరుకుంది. “నన్ను డ్రగ్గిస్ట్ అంటూ దూషించారూ… చేతులు చేసారు… ఇది తట్టుకోలేకపోయా,” అంటూ పబ్ బయట కల్పిక ఆవేదన వ్యక్తం చేశారు.
తన పట్ల తగిన ప్రవర్తన చేయలేదని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆమె అక్కడే ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. పబ్ యాజమాన్యం కూడా అదే ధోరణితో స్పందించిందని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని కల్పిక తెలిపారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా బయటపడాల్సి ఉంది.
Kalpika Ganesh కల్పిక గణేష్ సినీ ప్రయాణం:
2009లో ‘ప్రయాణం’ చిత్రం ద్వారా మొదలైంది. ‘ఆరెంజ్’, ‘జులాయి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘హిట్’, ‘యశోద’ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. వెబ్‌సిరీస్ ‘లూజర్’, ‘ఎక్కడికి ఈ పరుగు’ ద్వారా కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంది.
ఇప్పుడు ఆమె పబ్ ఘటనతో మరోసారి వార్తల హెడ్లైన్‌లోకి వచ్చారు. ఈ ఘటనపై టాలీవుడ్ వర్గాలు, అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.
