COVID
COVID : దేశంలో కరోనా వైరస్ మళ్లీ క్రమంగా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. గత కొద్దిరోజులుగా కేసుల సంఖ్య అధికమవుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,395కి చేరింది. ఇదే సమయంలో నిన్న ఒక్క రోజులో కొత్తగా 685 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
Summary:
COVID : 2024 జనవరి నుండి ఇప్పటివరకు దేశంలో మొత్తం 26 మంది కరోనా కారణంగా మరణించారు. రాష్ట్రాలవారీగా గమనిస్తే, మహారాష్ట్రలో 7 మంది, కేరళలో 6 మంది, ఢిల్లీ, కర్నాటకల్లో చెరో 3 మంది, ఉత్తరప్రదేశ్‌లో 2 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు.
ప్రస్తుతం యాక్టివ్ కేసుల పరంగా చూస్తే, ఆంధ్రప్రదేశ్‌లో 17 కేసులు, తెలంగాణలో 3 కేసులు ఉన్నట్లు అధికారికంగా వెల్లడైంది.
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అప్రమత్తమవుతోంది. పౌరులు మరింత జాగ్రత్తగా ఉండాలని, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అవసరమైతే మాస్కులు ధరించాలన్నారు. ప్రజలు అనవసరంగా ఆందోళనకు గురి కాకూడదని, అయితే మళ్లీ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలన్న సందేశాన్ని కేంద్రం నొక్కి చెబుతోంది.
COVID : ముఖ్య సూచనలు:
- శుభ్రత పాటించండి
- గొంతు నొప్పి, జలుబు, జ్వర లక్షణాలుంటే వైద్యులను సంప్రదించండి
- అత్యవసరమైతే మాత్రమే బహిరంగ ప్రదేశాలకు వెళ్లండి
- పాతికేళ్ళ పైబడినవారు, రోగనిరోధకశక్తి తక్కువవారు మాస్కులు ధరించండి
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మరింత పెరిగింది.
